మీడియా ముందు వ్యంగ్యంగా స్పందించిన మంచు విష్ణు

గురువారం, 6 ఏప్రియల్ 2023 (14:10 IST)
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుతో ఇటీవలి వివాదంపై మీడియాకు వ్యంగ్యంగా స్పందించడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. మనోజ్, తన భార్య మౌనికా రెడ్డి, తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుపతిలో జరిగిన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ఇటీవల కుటుంబ కలహాల గురించి విలేకరులు ప్రశ్నించారు. మీడియాకు మంచు మనోజ్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
 
కాగా గత కొన్ని రోజుల క్రితం నటుడు తన సోదరుడు మంచు విష్ణు తనపై, అతని బంధువులపై దాడి చేశాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. అయితే మోహన్ బాబు వ్యాఖ్యలతో మంచు మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు