మూఢం పోయింది.. ముహూర్తాలు వచ్చాయి.. అవి దాటితే..

సెల్వి

శనివారం, 1 జూన్ 2024 (18:06 IST)
మూఢం, శూన్య మాసం పోయాయి. శుభ గడియలు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు వివాహాలతో పాటు పలు శుభకార్యాలు జరిగాయి. పండితులు చెప్పిన వివరాల ప్రకారం ఈ నెలాఖరు నుంచి శుభ ఘడియలు మొదలు కానున్నాయి. 
 
మాఘ, ఉత్తర ఫాల్గుణి, హస్తా, స్వాతి నక్షత్రాల వేళ శుభ ముహుర్తాలు ఉన్నాయని, వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలని పండితులు చెప్తున్నారు. 
 
ఈ ముహూర్తాలు దాటితే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మంచి ముహూర్తాలు లేవని వివరించారు. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ నెలలోనే శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు