కాగా, మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైకాపా వర్గీయులు మంగళవారం రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర డీఐజీ మోహన్ రావు స్పందించారు. దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా జి.కొండూరులో అలజడి సృష్టించారని ఆరోపించారు. దేవినేని ఉమా చర్యలపై ఫిర్యాదు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఉమాను అరెస్ట్ చేశామని, వంద శాతం పారదర్శకంగా విచారిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.