ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి శివారు ప్రాంతంలో నిజామాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం రాత్రి దోపిడి జరిగింది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు దారి ఇచ్చేందుకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను లూప్ లైనులో నిలిపారు. ఆ సమయంలో ముసుగు దొంగలు రైలులోకి ప్రవేశించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం 10 బోగీల్లో ఈ దోపిడి జరిగింది.
లూప్ లైనులో ఆగివున్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు దోపిడీ చేశారు.