ఆయన శనివారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, 'ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత మంది కలిసి వచ్చినా వైకాపానే అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
అంతేకాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అని పేర్కొన్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెలవెలబోయిందని తెలిపారు. చిరంజీవి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉన్నారని, ఆయన రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని పేర్కొన్నారు.