జనసేన- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఓ వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ మరోవైపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వైసీపీ నేతలు ఎవరికి వారే పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను ఓడించలేరని చెప్పారు. ఈ మద్య ప్రతి ఒక్కరూ సీఎం జగన్‌ని టార్గెట్ చేసుకోవడం కామన్ అయ్యిందని.. ఆయన పట్టుదల.. ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు గమనిస్తున్నారని.. అందుకే ఎన్నికల్లో ఘనవిజయాన్ని అందిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు అని అంటున్న పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
"నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని నాని ఎద్దేవా చేశారు. 2024లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా చూసుకుందాం అన్నారు. అలాగే నువ్వు భయపెడతా భయపెడతా అంటున్నావు.. కొంపదీసి జానీ సినిమా చూపించి భయపెడతాడా అంటూ ఛలోక్తి విసిరారు. జగన్మోహన్‌రెడ్డి ఆనాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే భయపడలేదు. నీవేంటి ఆయనను భయపెట్టేది.. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్ అని" కొడాలి నాని తీవ్రమైన వాఖ్యలు చేశారు.