నిమ్మగడ్డ మాట విన్నారో.. చర్యలు తప్పవు : అధికారులకు మంత్రి వార్నింగ్

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలకు మేరకు నడుచుకునే అధికారులపై చర్యలు తప్పవని వైకాపా ప్రభుత్వ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. 
 
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఎస్ఈసీ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఇది మంత్రి పెద్దిరెడ్డికి ఏమాత్రం రుచిచడం లేదు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని పెద్దిరెడ్డి వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జిల్లా అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. అధికారులు ఏకగ్రీవాలకు వెంటనే డిక్లరేషన్ లు ఇవ్వాలని స్పష్టం చేశారు. 
 
ముఖ్యంగా, చిత్తూరు, గుంటూరు జిల్లాల అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని తెలిపారు. జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
జిల్లా అధికారులు ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు