తాజాగా డేవిడ్ వార్నర్ ముద్దుల కూతురు ఇండిరే.. విరాట్ కోహ్లీ జెర్సీని ధరించి ఫోటోకు ఫోజిచ్చింది. ఈ సందర్భంగా వార్నర్.. కోహ్లీకి థ్యాంక్స్ చెప్పాడు. 'మేం సిరీస్ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది' అంటూ క్యాప్షన్ జతచేశాడు.