పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారు.. తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి కౌంటర్

శుక్రవారం, 12 నవంబరు 2021 (17:55 IST)
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. నిధులు లేక ఏపీ.. కేంద్రాన్ని అడుక్కుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని సీరియిస్ అయ్యారు.
 
నిధుల విషయంలో కేంద్రం వద్ద తాము బిచ్చం ఎత్తుకుంటే… కేసీఆర్ ఏం బిచ్చం ఎత్తుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ సొమ్మును తెలంగాణ వ్యక్తులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారని ఆరోపించారు.
 
కేంద్రంపై కోపం ఉంటే ఏపీపై ఏడవటం ఎందుకని పేర్ని నాని ప్ర్రశ్నించారు. ‘మాకు రావాల్సిన నిధుల కోసం కేంద్రం వద్ద బిచ్చం ఎత్తుకుంటున్నాం..మీలా బయట కాలర్ ఎగరేసి లోపల కాళ్లు పట్టుకోము’ అని ఎద్దేవా చేశారు. స్నేహం అంటే స్నేహం..ఢీ అంటే ఢీ జగన్ నైజం అన్నారు. ఇంటిబయట కాలర్ ఎగరేయడం..ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకోవడం అనేది జగన్ తత్వం కాదని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు