ప్రొఫెసర్ లక్ష్మిని వదిలిపెట్టేది లేదు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ఆదివారం, 6 నవంబరు 2016 (13:09 IST)
గుంటూరులో గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని తాము నమ్ముతున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కేసులో ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అరెస్ట్ చేసి తీరుతామన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి, ఆమె భర్తలు పారిపోయారని, వారి మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుండటంతోనే పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారని చెప్పిన ప్రత్తాపాటి సాధ్యమైనంత తొందర్లోనే లక్ష్మిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
 
పోలీసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఆమె ఏ విమానాలు ఎక్కకుండా లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. అమె ఎక్కడున్నా వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి