అందం అత్యాశ... ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో మోడల్ కన్నుమూత

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (10:39 IST)
Kim Kardashian
ఆమె అత్యాశ ప్రాణాల మీదకు తెచ్చింది. మంచి అందగత్తె అయిన ఆ మోడల్.. మరింతగా అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అదికాస్త వికటించడంతో ఆమె కన్నుమూశారు. ఆమె పేరు క్రిస్టినా యాస్టెన్ గౌర్కానీ. స్వస్థలం కాలిఫోర్నియా. 
 
మోడల్‌గా మంచి గుర్తింపుతో పాటు పేరు కూడా ఉంది. ఆమె కిమ్ కర్దాషియన్‌ను పోలివుండటంతో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ అందంపై ఉన్న అత్యాశతో చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఓ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఆమెకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 
 
కాలిఫోర్నియాకు చెందిన గౌర్ఖానీ మోడలింగ్ ద్వారా అనేక మంది అభిమానులను సంపాందించుకున్నారు. పలు సర్జరీల అనంతరం అచ్చం కిమ్ కర్దాషియన్‌లా ఉందే అని తన అభిమానులతో అనిపించుకుంటూ మురిసిపోసాగింది. అచ్చం కిమ్‌లానే ఉండటంతో ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. 
 
ఈ క్రమంలో 34 యేళ్ల గౌర్కానీ మరింత అందంగా కనిపించేందుకు మరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అది వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది.ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఆపరేషన్ తర్వాత గౌర్కానీ తీవ్ర గుండెపోటుకు గురైందని, ఆమె మరణానికి అదే కారణమని తెలిపారు. సర్జరీ నేపథ్యంలో గుండె పనితీరుకు అవాంతరాలు ఏర్పడ్డాయని, గుండె ఆరోగ్యం క్షీణించడానికి నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కారణమని ప్లాస్టిక్ సర్జరీ చేసిన మేయా క్లినిక్ వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు