విశాఖపట్టణంలో యువతిపై ప్రైవేట్ కారు డ్రైవర్ అత్యాచారం

శనివారం, 7 జనవరి 2017 (12:02 IST)
విశాఖపట్టణంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ 17 ఏళ్ల అమ్మాయిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 30 ఏళ్ల డ్రైవర్ కోసం పోలీసులు గాలించి నిందితుడిని పి.శ్రీనివాస్‌గా గుర్తించారు. అతను హెచ్‌బి కాలనీలో నివసిస్తూ సుబ్బలక్ష్మినగర్‌లోని ఓ ఇంటిలో కారు డ్రైవరుగా పనిచేస్తున్నట్టు తేలింది. బాధితురాలు ఇదే ఇంట్లో పనిమనిషిగా పని చేస్తూ వచ్చింది. 
 
ఈ యువతిని గురువారం సాయంత్రం తాము పనిచేస్తున్న ఇంటి సమీపంలోని ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. 
 
బాధితురాలిని పరీక్షల నిమిత్తం కింగ్ జార్జి ఆస్పత్రికి పంపించారు. అమ్మాయి మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా, ఆమెకు 21 ఏళ్లు ఉంటాయని ఆమె యజమానులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి