మైనర్​ కిడ్నాప్​ కేసు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు

గురువారం, 18 నవంబరు 2021 (12:24 IST)
మైనర్​ కిడ్నాప్​ కేసులో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామానికి చెందిన మున్నా మహ్మద్(30)కు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్(16)ను ట్రాప్ చేసిన మున్నా 15 రోజుల క్రితం తీసుకెళ్లిపోయాడు. 
 
మున్నా తమ కూతురిని కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు ఈ నెల 7న చింతలపూడి పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. మున్నా సెల్ సిగ్నల్స్ ఆధారంగా వికారాబాద్ జిల్లా మీర్జాపురం గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చన్గోముల్ పోలీసులకు సమాచారం అందించారు.
 
చన్గోముల్ పోలీసులు ఈ నెల 15న వెళ్లేసరికే మున్నా బాలికతో ఎస్కేప్ అయ్యాడు. మున్నాకు షెల్టర్ ఇచ్చిన యువకుడు అక్బర్‌ను అదుపులోకి తీసుకుని చింతలపూడి పోలీసులకు సమాచారం అందించారు. చింతలపూడి పోలీసులతో బాలిక తల్లిదండ్రులు చన్గోముల్ పీఎస్‌కు వచ్చారు. అక్బర్‌ను ప్రశ్నించిన చింతలపూడి పోలీసులు ఈ నెల 16న ఏపీకి వెళ్లిపోయారు. 
 
బాలిక తల్లిదండ్రులు మాత్రం కూతురి ఆచూకీ కోసం చన్గోముల్ పీఎస్ వద్దే పడిగాపులు కాస్తున్నారు. చింతలపూడి పోలీసులు అక్బర్ దగ్గర లంచం తీసుకుని వదిలేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు మున్నాను పట్టుకుని తమ కూతురిని కాపాడాలని వేడుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు