దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీరును భారత రాజ్యాంగంలో భాగస్వామ్యం చేశారని, త్రిబుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, రామమందిరం నిర్మాణం లాంటి జఠిలమైన సమస్యలను పరిష్కరించారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముందు చూపుతో లాక్ డౌన్ ద్వారా ప్రజలను సురక్షితంగా రక్షించారని, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు అండగా నిలిచారని,లాక్ డౌన్ అనంతరం అందరూ తిరిగి వ్యాపారాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారని, వివిధ మాధ్యమాల ద్వారా మోడీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రఘునాధ్ బాబు మరియు రాష్ట్ర, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.