సమాజంలో ఏ రంగంలోనైనా ప్రోత్సాహాంతోనే ప్రతిభకు మెరుగులు దిద్దడం జరుగుతుందని ఏ.పి. రాష్ట్ర 'మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీతమ్మధార వి.జె.ఎఫ్. వినోద వేదికలో మంగళవారం జరిగిన 3 రోజులు మోహిని యాట్టం సదస్సు ముగింపు, కళాజీవా పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకతకు, సమైక్యతకు ప్రతీక మన విశాఖ నగరమని అన్నారు. గాయత్రి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాండ్రే గుల రామ్ కుమార్ మాట్లాడుతూ, బాలల్లో కళానైపుణ్యానికి ఇటు వంటి సదస్సులు అవసరమని స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంస్థ ను ఆయన అభినందించారు.
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఎంతో మంది 'అంతర్జాతీయ స్థాయి ఖాతిని పొందిన కళాకారులు విశాఖలో ఉన్నారన్నారు. కొరియోగ్రఫీలో వైవిధ్యం ఉండడంతో ఎటువంటి కళాభిమానులనైనా ఇట్టే ఆకట్టుకోగలరన్నారు. చిత్ర కళలో జాతీయ పురస్కారాలు అందుకుంటున్న సి. సంధ్యా శంకర పట్నాయక్, సినీ కొరియోగ్రఫర్, మోహినియాట్టం శిక్షకురాలు వినిత వర్గీషే (కేరళ) లను "కళాజివా పురస్కారం-2021 " తో కాయల ఘనంగా సత్కరించారు. కొరియోగ్రఫర్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో బ్రహ్మకుమారి రామేశ్వరి, వీ జే ఎఫ్. కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, ఎ.పి.డిప్లొమో ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. మహేశ్వర రెడ్డి , కె.వి.ఆర్. మిత్ర మండలి ప్రతినిధి కె. సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.