ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ముకునూరు గ్రామానికి సరిత అనే మహిళకు వెంకన్న అనే వ్యక్తితో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి రేణుక అనే నాలుగేళ్ళ కుమార్తె ఉంది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి సరిత ముసారాంబాగ్‌లోని ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కూతురు రేణుకతో కలిసి అద్దెకు ఉంటుంది.
ఈ క్రమంలో సరితకు డీసీఎం డ్రైవర్ వెంకట్‌రెడ్డి (35)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఫలితంగా గత 9 నెలలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే, తన ప్రియుడుతో పడకసుఖం అనుభవించే సమయంలో కుమార్తె రేణుక అడ్డుగా వచ్చేది. దీంతో సరిత చిత్రహింసలకు గురిచేసి వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ తల్లిని చిన్నారి వీడలేదు.
దీంతో ఆ చిట్టితల్లిపై వెంకట్ రెడ్డి కూడా తన ప్రతాపం చూపిస్తూ వచ్చాడు. తల్లితో పాటు వెంకట్ రెడ్డి కొట్టిన దెబ్బలకు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్ రెడ్డి చిన్నారిని కొరకడంతో తీవ్ర రక్తస్రావమై కొన్ని రోజుల పాటు అన్నం కూడా తినలేని స్థితికి చేరింది. ఇటీవల కొట్టిన దెబ్బలకు బాలిక ఎడమ చేయి విరిగిపోయింది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు గమనించి ఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
ఆయన రేణుకను చేరదీసేందుకు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుతో కలిసి బాలిక ఇంటికి వచ్చారు. అప్పటికే తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలికను రెస్క్యూ హోమ్‌కు తరలించి, సరితను అరెస్టు చేయించారు. పోలీసుల రాకను గుర్తించిన వెంకట్‌రెడ్డి పరారైపోయాడు. అతని కోసం కోసం గాలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.