మాతృత్వానికే మచ్చ తెచ్చింది ఆ తల్లి. తన రెండో పెళ్ళికి అడ్డొస్తున్నాడనే కారణంతో తన మూడేళఅల కుమారుడిని ఆ తల్లి కిరాతకం చంపేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముళ్లపాడుకు చెందిన సుజాతకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త ఆరునెలల క్రితం మరణించడంతో.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే వ్యక్తితో రెండో పెళ్లికి సిద్ధమైంది.
అయితే మూడేళ్ల కుమారుడు సుజాత రెండో పెళ్ళికి అడ్డంగా మారడంతో.. కన్నబిడ్డను చంపేయాలనుకుంది. అంతే అన్నంలో పురుగుల మందు కలిపి పసివాడిని బలితీసుకుంది. ఆపై ఏమీ తెలియనట్లుగా తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు.