సినీ నటుడు మురళీ మోహన్ సాక్షాత్తు తిరుమల వెంకన్నకూ కులం తగిలించేశారు. ఎందుకు అలా అన్నారోగానీ…. తిరుమల శ్రీనివాసుడిని వెంకన్న చౌదరి అనేశారు. రాజమండ్రిలో ఒక సమావేశంలో మాట్లాడిన మురళీ మోహన్… మొన్న కర్నాటక ఎన్నికల్లో ఏదో చేద్దామనుకున్నారు. తెలుగు ప్రజలు బుద్ధి చెప్పారు. ఎక్కువ సీట్లు గెలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కొన్ని సీట్లు మాత్రం తగ్గించి తిరుమల వెంకన్న చౌదరి, తిరుమల వెంకన్న చౌదరి… అంటూ నాలుక కరచుకున్నారు.
తనకు బాగా పరిచయం, తరచూ పలికే వెంకన్న చౌదరి ఎవరైనా వుండి వుండాలి. అలవాటులో పొరపాటున తిరుమల వెంకన్న గురించి చెబుతూ వెంకన్న చౌదరి అని తడబడి వుండాలి. ఎందుకు మురళీ మోహన్ ఇలా మాట్లాడారో అర్థంకాక తెలుగుదేశంపార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. పద్మావతమ్మది ఏ కులం, గోవిందరాజస్వామిది ఏ కులం, వరాహస్వామిది ఏ కులం… అవి కూడా మీరే చెప్పండి అంటూ వైసిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.