3వ తేదీ మళ్ళీ ఆపని చేస్తానంటున్న ముద్రగడ...

శుక్రవారం, 28 జులై 2017 (21:08 IST)
కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడంలో ముద్రగడ ముందున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ముద్రగడ తీవ్ర ఆరోపణలు కూడా చేసేశారు. మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేసిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లను కల్పించడంలో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. ఇది కాస్త కాపులను తీవ్రంగా బాధిస్తోంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ముద్రగడ ఉద్యమ బాట పట్టారు. మొదట్లో ఆయన నిర్వహించిన సభ తునిలో పెద్ద గొడవై చివరకు రైళ్ళు తగలబడే పరిస్థితికి వచ్చింది.
 
దీనిపై అప్పట్లో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం స్పందించిన తీరును చూస్తే ఎలాగైనా కాపులకు రిజర్వేషన్లు వచ్చేస్తాయని అందరూ భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో 26వ తేదీన పాదయాత్రను నిర్వహించాలనుకుని నిర్ణయించుకుని ముద్రగడకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. పోలీసులు ఆయన్ను గృహ నిర్భంధం చేసి అక్కడే ఉంచేశారు. 
 
కానీ ప్రభుత్వం దృష్టికి కాపుల సమస్యలను తీసుకెళ్ళాలని కంకణం కట్టుకున్న ముద్రగడ మళ్ళీ వచ్చే నెల 3వతేదీన పాదయాత్ర చేయడానికి సిద్థమయ్యారు. ఈసారి పోలీసులు అడ్డొస్తే  ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణత్యాగమైనా చేసి రిజర్వేషన్లను సాధించుకుంటామన్న ధీమాతో ఉన్నారు ముద్రగడ. కానీ చంద్రబాబు మాత్రం ముద్రగడ పప్పులు ఉడకుండా అడ్డుపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి