అనాధ ఆర్యవైశ్య మహిళకు ముస్లింల అంత్యక్రియలు.. ప్రశంసలందుకుంటున్న హిందూపురం ముస్లింలు

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:31 IST)
'ధనముంటే జాస్తి దరిద్రముంటే నాస్తి-బంధుత్వం' అనే నానుడి నిజం అనే విధంగా  ప్రస్తుత పరిస్థితులు లోకంలో ఎటుచూసినా కనబడుతున్నాయి.

హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు ఆనుకొని ఉన్న కొల్లాపురమ్మ గుడివీధిలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నారాయణమ్మ(80) అనే వృద్దు రాలు కాపురముండేది.

గత రెండు రోజులుగా ఆమె బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్థానిక రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ 'ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్' అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు సహకరించాలని కోరారు. 

ఉమర్ ఫారూఖ్ ఖాన్ మిత్రమండలి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నారాయణమ్మ శవాన్ని దుర్వాసనతో కూడుకున్న దాదాపు శరీరంలోని సున్నిత భాగాలను చీమలు కొరికేసి ఉండగా డీడీటీ పౌడర్ స్ప్రే లతో శుభ్ర పరిచి అంబులెన్స్ వాహనంలో ఆర్యవైశ్య హిందూ స్మశాన వాటికలో ఆర్యవైశ్య సాంప్రదాయ ప్రకారం దహనo చేశారు.

ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించడం, సోదర భావాన్ని ఆచరించి చూపించడం వసుధైక కుటుంబం ఒకే తల్లి బిడ్డల్లా కలిసి మెలిసి కష్ట సుఖాల్లో కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా దేశ అభివృద్ధికి సుస్థిరతకు శాంతియుత సమాజ స్థాపనకు కృషిచేయడం ఇస్లాం శాంతియుత సందేశమని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు ఆర్యవైశ్య సంఘం నాయకులు జేపీకే రాము, సహకారం సర్కిల్ ఇన్స్ పెక్టర్ మన్సూరుద్దీన్ అందించారు. ప్రముఖులు. అధికారులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మిత్ర మండలికి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో షేక్ షబ్బీర్, అతీక్, నాసీర్, టైలర్ నస్రుల్లా ఖాన్, ఆలీబాయ్, మధు సూధన్, రంగ నాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు