ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు, ముస్లింల మధ్య బీజేపీ విబేధాలు సృష్టిస్తోందని ఆరోపించారు. గాడ్సే వారసులమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రుజువు చేసుకున్నాయని అగ్నివేష్ చెప్పారు. ఈ సభలో స్వామి అగ్నివేష్, సీపీఐ నేత రామకృష్ణ, కేశినేని, గద్దె రామ్మోహన్ హాజరైనారు.
రాష్ట్రపతి ప్రసంగంలో సీఏఏ ప్రస్తావన
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తూ సీఏఏ అంశాన్ని ప్రస్తావించగానే సభ ఒక్కసారిగా దద్దరిల్లింది. విపక్షాల నినాదాలతో సభ మార్మోగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.