నందిగామ నగర పంచాయతీ ఛైర్మన్‌గా మండవ వరలక్ష్మి

గురువారం, 18 మార్చి 2021 (13:04 IST)
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నందిగామ నగర పంచాయతీ చైర్మన్‌గా మండవ వరలక్ష్మి,వైస్ చైర్మన్‌గా మాడుగుల నాగరత్నంలను ఆయన ఎంపిక చేశారు ఎమ్మెల్యే నిర్ణయానికి అధికార పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. 
 
గురువారం ఉదయం 11 గంటలకు నందిగామ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్‌లు ఎన్నుకోబడిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 
 
నందిగామ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ, మంచి పేరు తెచ్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్‌లకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు దిశానిర్దేశం చేశారు. 
 
అనంతరం చైర్మన్‌గా ఎంపిక కాబడ్డా మండవ వరలక్ష్మి, వైస్ చైర్మన్‌గా ఎన్నుకోబడిన మాడుగుల నాగ రత్నం ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకు తోటీ కౌన్సిలర్‌లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ కుమార్‌కు, తమ గెలుపులో సహకరించిన నందిగామ ప్రజలకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు