గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన తర్వాత ఆమె మాట్లాడుతూ, 'ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి' అని ఆమె వ్యాఖ్యానించారు.