కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సింగ్ రిజైన్.. త్వరలో బీజేపీ తీర్థం

మంగళవారం, 30 జులై 2019 (15:14 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. 
 
కాంగ్రెస్ చరిత్ర ముగిసిపోయిందన్నారు. ఆ పార్టీకి ఇకపై భవిష్యత్ లేదన్నారు. ఈ రోజు దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉందన్నారు. దేశం మొత్తం ఆయన వైపు ఉండగా, తాను కూడా ఆయనతో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాను బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. పైగా తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు