70వ యేటలోకి చంద్రబాబు : జగన్ - కేటీఆర్ శుభాకాంక్షలు

శనివారం, 20 ఏప్రియల్ 2019 (11:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న ఆయన స్వగృహంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. 
 
ఈ సందర్భంగా చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనసేన పార్ట అధినేత పవన్ కళ్యాణ్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
'చంద్రబాబుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
 
అలాగే, తన తండ్రి చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'ఓ విజనరీగా, ధైర్యవంతుడైన వ్యక్తి అయిన మిమ్మల్ని తండ్రిగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. మీరు ప్రపంచానికి ఓ విజనరీగా మాత్రమే కాదు.. ఓ భర్తగా, తండ్రిగా, తాతగా మాపై అమితమైన ప్రేమ కురిపించారు. దేవాన్ష్‌తో నాలుగేళ్ల పిల్లాడిలా పరిగెత్తారు. రాబోయే రోజుల్లో మీరు ఇంతే ఉత్సాహంతో, శక్తిమంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న' అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు