లోకేశ్ టీడీపీకి కాబోయే నాయకుడు అని, నాయకత్వ శ్రేణుల మధ్య ఏకగ్రీవ ఆమోదం లభించడం విశేషం. గతంలో 2014-19 మధ్య లోకేశ్ పంచాయత్ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. నారా లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.