జ‌గ‌న్ స్ట‌యిల్ లో నారా లోకేష్ ఓదార్పు యాత్ర‌!

మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:30 IST)
వైఎస్ ఆర్ మృతి ఘ‌ట‌న‌తో గుండె ఆగి చ‌నిపోయిన కుటుంబాల‌ను ఓదార్చేందుకు జ‌గ‌న్ గ‌తంలో ఓదార్పు యాత్ర నిర్వ‌హించారు. కాంగ్రెస్ కేంద్ర నాయ‌క‌త్వం, సోనియా గాంధీ వ‌ద్ద‌ని వారించినా, విన‌కుండా చేసిన ఓదార్పు యాత్ర జ‌గ‌న్ కి రాజ‌కీయంగా ఎంతో లాభించింది. ఇపుడు అదే జ‌గ‌న్ బాట‌లో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌య‌నించ‌నున్నారా?

రాష్ట్రంలో దాడుల్లో చ‌నిపోయిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ స్ట‌యిల్ లో ఓదార్పు యాత్ర ప్రారంభిస్తున్నారా? దీనికి స‌మాధానం కర్నూల్ లో హజీరా కుటుంబాన్ని పరామర్శిస్తున్న నారా లోకేష్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.

మంగళగిరిలో నీ టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 500 మందిపై దాడులు జరిగాయ‌ని అన్నారు. రాష్ట్రం మొత్తం పర్యటించి తాను బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా కర్నూల్ లో హజీరా కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తుంటే, అక్రమ కేసులు పెడుతున్నారు అని, తప్పుడు కేసులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని ప్రస్తావించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు రమ్యశ్రీ హత్యోదంతం చాలా హేయమైన ఘటన అని, ప్రతి ఒక్కరూ ఖండించాలి అని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు