పవన్‌కు ధైర్యముంటే ప్రధాని మోడీని నిలదీయాలి : నారా లోకేశ్

సోమవారం, 4 జూన్ 2018 (10:17 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు ఏపీ రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ సవాల్ విసిరారు. పవన్‌కు ధైర్యముంటే ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయాలంటూ డిమాండ్ చేశారు.
 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇక అవిమాని సాక్ష్యాధారాలతో ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు, పోరాట యాత్రల పేరుతో చంద్రబాబును విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. 
 
నిరంతరం ఏపీ ప్రజల కోసం పనిచేస్తోన్న నాయకుడు చంద్రబాబు అని, అటువంటి నాయకుడిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా ప్రధాని మోడీని వీళ్లు విమర్శించారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలపై ఇచ్చిన హామీలను ఆయన గాలికి వదిలేశారనంటూ విమర్శలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు