నేడు నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర

శుక్రవారం, 27 జనవరి 2023 (08:20 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పేరుతో చేపట్టనున్న పాదయాత్ర శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వరదరాజులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనల తర్వాత ఈ పాదయాత్ర మొదలవుతుంది. తొలి రోజున ఆయన 8.5 కిలోమీటర్ల మేరకు నడువనున్నారు. 
 
ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభించి, 11.03 గంటలకు ఆయన పాదయాత్రను మొదలుపెడుతారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. 
 
సభ ఆ తర్వాత కుప్పంలోని ప్రభుత్వ ఆస్పత్రి శెట్టిపల్లె క్రాస్ రోడ్డు, బెగ్గినపల్లి క్రాస్ రోడ్డు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయానికి ఆయన బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. ఈ యాత్ర కోసం టీడీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు