మిస్టర్ సైకో సీఎం జగన్ రెడ్డి.. గుర్తు పెట్టుకో.. ప్రజలు తలచుకుంటే గుడ్డలూడదీసి నిలబెడతారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రచార రథాన్ని పోలీసులు దొంగిలించడంపై కూడా ఆయన మండిపడ్డారు. వీళ్లు పోలీసులా.. దొంగలా అంటూ సూటిగా ప్రశ్నించారు. గత మూడు రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు శుక్రవారం కూడా పాదయాత్ర చేశారు. ఆయన గుడిపల్లిలోని టీడీపీ కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
తాను కేవలం ఒక్క రాష్ట్ర ప్రజల కోసమే కాకుండా పోలీసు కుటుంబాలు, వారి పిల్ల కోసం కూడా పోరాడుతున్నానని, ఒక సైకో ముఖ్యమంత్రి మెడపై కత్తిపెట్టి చేయమంటేనే పోలీసులు చేస్తున్నారని, వారి బానిసత్వాన్ని చూస్తే జాలేస్తుందని అన్నారు.
దీనికి కారణం సైకో జగన్ రెడ్డికి ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే నల్ల జీవోలతో విపక్షాలను అణిచి వేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ, వాళ్లు తలచుకుంటే గుడ్డలు ఊడదీసి నిలబెడతారని హెచ్చరించారు. వైఎస్. వివేకా హత్య కేసులో జగన్ రెడ్డికి శిక్షపడటం ఖాయమని అన్నారు. గొడ్డలి వేటుతో లేపేసి గుండెపోటు అంటూ అబద్ధపు ప్రచారం చేశారని చంద్రబాబు