ఈ రోవర్ ల్యాండింగ్ కోసం అత్యాధునిక సాంకేతికతను నాసా వినియోగించింది. ఇతర ప్రాజెక్టులతో పోల్చితే.. అంగారకుడిపై చిత్రాలు తీయడానికి, ధ్వనిని రికార్డు చేయడానికి ఇందులోనే ఎక్కువ కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చింది.
గ్రహంపై ఉన్న రాళ్లను సేకరించే ట్యూబులు కూడా అత్యంత శుభ్రమైనవని నాసా వెల్లడించింది. ఇతర స్పేస్‌క్రాఫ్ట్‌ల లాగే పర్సర్వెన్స్ కూడా 300మిలియన్ మైళ్లుకన్నా ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపై అడుగుపెట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆరు చక్రాల పెర్సీవరెన్స్.. నాసా ప్రతిష్టాత్మక 'క్యూరియాసిటీ' రోవర్‌తో పోలి ఉంటుంది.