సూర్యుడిని అతి సమీపంగా చూస్తే ఇలా వుంటాడు..!

శుక్రవారం, 17 జులై 2020 (13:41 IST)
NASA
నాసా సూర్యునికి సంబంధించి అద్భుతమైన ఫోటోను విడుదల చేసింది. నాసాకు చెందిన సోలార్ ఆర్బిటార్ తొలిసారి సూర్యుడి ఫోటోలను అత్యంత సమీపంగా తీసింది. సూర్యుడిపై అధ్యయనం కోసం యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసాలు సంయుక్తంగా సోలార్ ఆర్బిటార్ ప్రాజెక్టు చేపట్టాయి. 
 
ఈ ఏడాది ఫిబ్రవరి 9న వ్యోమనౌక ద్వారా సోలార్ ఆర్బిటార్‌ను ప్రయోగించారు. అది జూన్ నెల మధ్యలో సూర్యుడికి అతిసమీపంగా వెళ్లినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. సోలార్ ఆర్బిటార్‌లో మొత్తం ఆరు ఇమేజింగ్ పరికరాలు ఉన్నాయి. అవన్నీ సూర్యుడి ఒక్కొక్క కోణాన్ని స్టడీ చేయనున్నాయి.
 
ఇంత సమీపంగా తీసిన సూర్యుడి ఫోటోలను గతంలో ఎప్పుడూ చూడలేని, ఆ ఫోటోలు అసాధారణంగా ఉన్నాయని నాసా ప్రాజెక్టు శాస్త్రవేత్త హోలీ గిల్బర్ట్ తెలిపారు. ఈ ఫోటోల ఆధారంగా సూర్యుడి ఉపరితల వాతావరణాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేయనున్నారు. 
 
దీని ఆధారంగా భూమితో పాటు సౌరవ్యవస్థలో సూర్యుడి ప్రభావాన్ని అధ్యయనం చేసే వీలు అవుతుందన్నారు. ఎక్స్‌ట్రీమ్ ఆల్ట్రావాయిలెట్ ఇమేజ్‌లో.. సూర్యుడి అధ్యయనం కొత్తగా ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు