గత ఆగస్టు 8న నయీం ముఠా మిలీనియం టౌన్ షిప్ లో మారణాయుధాలతో తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతని అరెస్టుకు ప్రయత్నించగా ఆ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడని వివరించారు. నయీం దందాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. అతని అరాచకాలపై 174 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో 741 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు 124 మంది నిందితులు అరెస్టు అయ్యారని కేసీఆర్ వెల్లడించారు. నయీం కబ్జాలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూమిని, అతనికి చెందిన 37 ఇళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.