చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

సెల్వి

బుధవారం, 9 జులై 2025 (21:15 IST)
Chia Seeds
చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే చియా సీడ్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. చియా విత్తనాలను తినేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగటం ముఖ్యం. 
 
సలాడ్లు, పెరుగు లేదా స్మూతీలకు చియా విత్తనాలను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. చియా సీడ్స్‌ను వాడే ముందు రెండు గంటల పాటు నానబెట్టడం మరిచిపోకూడదు. చియా గింజలు ప్రీబయోటిక్‌గా పనిచేస్తాయి. ఇది గట్ సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. 
 
చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తినడం వల్ల వాటి జీర్ణక్రియ సులభతరం అవుతుంది. చియా సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతగానో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో వుండే ఫైబర్ షుగర్ లెవల్‌ను నియంత్రిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు