నెల్లూరు జిల్లాలో ఘోరం : ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

బుధవారం, 23 మార్చి 2022 (17:45 IST)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు మఠం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని ఢీకొట్టిన తర్వాత బస్సు 15 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లో బోల్తాపడింది. దీంతో ఓ మహిళా ప్రయాణికురాలు చనిపోయారు. 
 
ఆత్మకూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న పల్లెవెలుగు బస్సు నెల్లూరు - కడప రహదారిలో రోడ్డు పక్కన మఠం కాలనీ వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు