పెళ్ళై నెలరోజులే.. రోడ్డు ప్రమాదంలో నవదంపతులిద్దరూ...

సోమవారం, 11 మార్చి 2019 (15:23 IST)
పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళై నెలరోజులైంది. హాయిగా సాఫీగా సాగిపోతున్న జీవితం వారిది. అయితే ఉన్నట్లుండి వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. రోడ్డుప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
 
తిరుపతికి సమీపంలోని జూపార్కు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులిద్దరూ మృతి చెందారు. తిరుపతి నగరానికి చెందిన బాలుతో చంద్రగిరి మండలం కూచివారిపల్లికి చెందిన కావ్యకు సరిగ్గా నెలరోజుల క్రితం వివాహమైంది. 
 
పెళ్ళయిన ఆనందంలో వారానికి ఒకసారి తన అత్తమామల ఇంటికి స్కూటర్ పైన ఇద్దరూ వెళ్ళి వస్తూ ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున కూడా స్కూటర్ పైన వెళుతుండగా సైన్స్ సెంటర్ వద్ద బెంగుళూరు నుంచి వస్తున్న కారు వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వధూవరులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారి మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు