కొత్తగా పెళ్ళయ్యింది, భార్యను వదిలి ఉద్యోగంలో చేరితో యజమాని కూతురు లైన్లో పడిపోయింది

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (16:48 IST)
అతనికి ఈ మధ్యనే పెళ్ళయ్యింది. అయితే మధ్య తరగతి కుటుంబం. పనిచేస్తే గానీ ఇళ్ళు గడవని పరిస్థితి. పెళ్ళయిన నెలకే భార్యను ఇంటివద్దే వదిలి నేరుగా హైదరాబాద్‌కు వెళ్ళాడు. ఒక కంప్యూటర్ సేల్స్ సెంటర్లో చేరాడు. బాగా సంపాదించడం ప్రారంభించాడు. ఆ యువకుడు అందంగా ఉండటంతో ఏకంగా యజమాని కూతురే పడిపోయింది. ఇంకేముంది ఆమెను తీసుకుని పరారయ్యాడు.
 
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ముప్పాలపాడు గ్రామానికి చెందిన ఫృద్వీకి నెల క్రితమే వివాహమైంది. తమ సమీప బంధువుతోనే వివాహం చేశారు. అయితే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చేసిన ఫృద్వీ ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు  వచ్చాడు. భార్యను తన ఇంటిలోనే వదిలి వచ్చాడు. హైదరాబాద్‌లో ఒక కంప్యూటర్ సంస్థలో సేల్స్‌మెన్‌గా చేరాడు.
 
బాగా సంపాదించడం ప్రారంభించాడు. అయితే యజమాని కుమార్తె దీపికతో ప్రేమాయణం నడిపాడు. ఫృద్వీ అందంగా ఉండటంతో పాటు మాటకారి కావడంతో దీపిక సులువుగా అతనికి పడిపోయింది. ఇలా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. హద్దులు దాటడం జరిగిపోయాయి.
 
నన్ను పెళ్ళి చేసుకో అంటూ దీపిక ఫృద్వీపై ఒత్తిడి తెచ్చింది. దీంతో అతను ఆమెను మూడురోజుల క్రితం బయటకు తీసుకెళ్ళిపోయాడు. దీపిక తండ్రికి ఫృద్వీపై అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి సెల్ నెంబర్లు హైదరాబాద్ లోనే స్విఛ్ ఆఫ్ అయ్యాయి.
 
దీంతో వారిని ట్రేస్ అవుట్ చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. కానీ నిన్న ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ఫృద్వీ అతని తండ్రికి ఫోన్ చేశాడు. యజమాని కుమార్తెను తీసుకొచ్చేశాను. ఆమెను ఇంటికి తీసుకొస్తున్నట్లు చెప్పాడు. నీకు ఇప్పటికే పెళ్ళయ్యింది. ఇంట్లో భార్య ఉంది. ఇంకో భార్య అంటే ఎలా అంటూ తండ్రి చీవాట్లు పెట్టాడు.
 
దీంతో ఫృద్వీ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఇంటికి వెళ్ళినా దీపికను తనను కలపరని నిర్ణయించుకున్నాడు. తాడేపల్లికి దూరంలో ఉన్న ఒక పాడుపడిన బంగ్లాలోకి ఇద్దరూ వెళ్ళారు. అక్కడి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. మేకలు తోలుకునే వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే ఫృద్వీ చనిపోయాడు. దీపిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు