ఎంతటి వారైనా శిక్ష తప్పదు: వాసిరెడ్డి పద్మ

సోమవారం, 29 జూన్ 2020 (19:05 IST)
20 ఏళ్ల విద్యార్ధినిని ఇంజినీరింగ్ విద్యార్థులు గత రెండు ఏళ్ళుగా అత్యాచారం చేయడం దారుణమైన ఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ కాన్ఫిరెన్స్ హలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కేసును మహిళా కమిషన్,ప్రభుత్వం,పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవటం జరిగింది అన్నారు.
 
ఈ కేసులో ఏ-1 ముద్దాయి పోలీస్ కొడుకు అని తెలిపారు. ఈ కేసులో అత్యాచారానికి గురైనా విద్యార్థిని కేసు వెనుక ఇంకా కొందరు మహిళా విద్యార్థునులు ఉన్నారు అని వారు కూడా అత్యాచారానికి గురైన మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పోర్న్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు అని చెప్పారు.
 
చదువుకునే విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడం చాలా బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 'దిశ' కేసు నమోదు అయితే ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు