కానీ నూజివీడు పోలీసులు మాత్రం మానవత్వంలో మరో అడుగు ముందుకు వేశారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో తమ విధులన్నీ పూర్తి చేయడమే కాకుండా, తిరిగి అక్కడ యాక్సిడెంట్ జరగకుండా... రోడ్డును కూడా మరమ్మతు చేశారు.
కృష్ణాజిల్లా నూజివీడు రహదారిలో యాక్సిడెంట్ అయింది.
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఆ ప్రమాదానికి సంబంధించి డయల్ 100 కు కాల్ రాగా, వెంటనే నూజివీడు ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
లోడుతో వెళ్తున్న లారీలోని సరుకు రహదారిపై అస్తవ్యస్తంగా పడడంతో, వెంటనే ఎస్ఐ, సిబ్బంది లారీలను పక్కకు జరిపి రహదారిపై ఉన్న వస్తువులను శుభ్రం చేయించారు. అంతేకాదు... ఇంకొకసారి ఆ ప్రాంతంలో ప్రమాదం జరగకూడదని ఏకంగా రోడ్డును మరమ్మతు చేశారు. ప్రమాదం జరిగిన చోట రేడియం స్టిక్కర్లు కలిగిన డ్రమ్ములను అమర్చారు. రోడ్డును పూర్తిగా వేసి, మరమ్మతు పూర్తయ్యాక ఈ డ్రమ్ములను తొలగిస్తామని తెలిపారు.