ఎమ్మెల్యే స్థానంలో ఉండి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నావంటూ అబ్జెక్షన్ చెప్పారు. తాడిపత్రిలో నడిరోడ్డు మీదకు వస్తా.. రా చూసుకుందామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. 'కమీషన్ల కోసం ఇంట్లో నాలుగు బాక్సులు పెట్టుకున్నావ్… తాడిపత్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నీ భార్యని కూడా ఇందులోకి లాగావు', ఇది మంచిది కాదు అంటూ హితవు పలికారు. ఎన్ని ఇళ్లు కూలుస్తామని చెప్పావ్.. ఇప్పుడు ఎన్ని కూల్చావంటూ ప్రశ్నలు సంధించారు.
నీకు దమ్ముంటే నా మీద ఛార్జి షీట్ వేయించు.. జైలుకు పంపించు అంటూ సవాల్ విసిరారు. ఇటీవల తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీస్ జారీ చేశారు. 6 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్ కూడా ఇచ్చారు.