దొనకొండ కాదు.. తిరుపతి కొండను ఏపీ రాజధాని చేయండి.. ఎవరు?

గురువారం, 22 ఆగస్టు 2019 (15:40 IST)
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ.. ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లోకెక్కే తిరుపతి మాజీ ఎంపి, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి ఏకంగా ఎపి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎపి రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. ఇది కాస్త రగడకు దారితీస్తోంది. 
 
టిడిపి నేతలు దీనిపై ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న రాజధాని ప్రాంతాన్ని వేరొక ప్రాంతానికి తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. 
 
సిఎం గారు.. మీరు ముందు రాజధానిని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఒకవేళ రాజధాని మారిస్తే దొనకొండ ఎందుకు.. తిరుపతి కొండను తీసుకోండి.. దొనకొండలో రాజధాని పెడితే క్యాన్సర్ వస్తుంది. అలాంటి పరిస్థితులే అక్కడ ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు