కానీ, గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, వైకాపా గెలిచింది. ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దీంతో అమరావతిలో సీన్ రివర్స్ అయింది. టీడీపీ హయాంలో నిత్యం సందడిగా ఉండే అమరావతిలో ఇపుడు శ్మశాన శబ్దం వినిపిస్తోంది.
అదేసమయంలో ఏపీ రాజధాని దొనకొండ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఫలితంగా భూముల ధరలు కొండెక్కాయి. ఏపీ రాజధాని అమరావతి అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధాని మారబోతుంది అని, త్వరలోనే ప్రకటన రాబోతుందని ప్రచారం జోరందుకుంది.