కర్నూలు జిల్లా పత్తికొండలో రెచ్చిపోతున్న ఆకతాయిలు. అడ్డు అదుపు లేకుండా పోతుందన్న విద్యార్థినిల తల్లిదండ్రులు. ఇంతకీ మేటర్ ఏంటంటే... కరోనా పుణ్యమా అంటూ స్కూళ్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. అయితే... ఈ ఆన్లైన్ క్లాసులు వలన ఎంత నేర్చుకుంటున్నారు అనేది పక్కన పెడితే... ఆన్లైన్ క్లాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రూపులో నీలిచిత్రాల వీడియో పోస్టులు విద్యార్థులలో కలకలం రేపుతున్నాయి.
నీలి చిత్రాలను పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని, గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న టీచర్లు ఇలాంటి పోస్టులపై స్పందించకపోవడం వలన టీచర్లపై కూడా చర్య తీసుకోవాలని ఎంఈఓకు విద్యార్ధి సంఘం నాయకులు ఫిర్యాదు చేసారు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు తల్లిదండ్రుల ఫోన్ నుంచే వింటున్నారు. ఏ విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్ నుంచైనా ఈ నీలిచిత్రాల వీడియోలు వచ్చాయా...? లేక ఎవరైనా కావాలనే నీలి చిత్రాలను ఈ గ్రూపులో పోస్ట్ చేసారా అనేది తెలియాల్సివుంది.