మహిళలపై అకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో దివ్యాంగురాలి మరణం సంచలనం రేపింది. కొందరు దుండగులు అత్యంత దారుణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనతో ఒంగోలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.