2024 ఏపీ ఎన్నికలు జనసేనకు అనేక విధాలుగా చారిత్రాత్మకమైనవి. ఎందుకంటే పార్టీ పోటీ చేసిన మొత్తం 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.
"నేను నా జీవితంలో ఏ పదవిని లేదా అధికారాన్ని ఆశించలేదు. నేను నటుడిని కావాలనుకోలేదు, నేను రాజకీయ నాయకుడిని కావాలనుకోలేదు. డిప్యూటీ సీఎం కావాలని కలలు కనలేదు. నేను చేయాలనుకున్నది నా దేశం కోసం. నేను ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాను. ఈ అధికార స్థానాలు నన్ను ఉత్తేజపరచవు.. అని పవన్ అన్నారు.