కేంద్రం ఇచ్చిన నిధులెంత? రాష్ట్రం ఖర్చు చేసిందెంత? పవన్ కల్యాణ్

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (18:24 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని పవన్ అన్నారు. హైదరాబాద్, ప్రశాసన్ నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్‌ల భేటీ ముగిసింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఏపీకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి తాను మద్దతు ఇచ్చానని తెలిపారు. న్యాయం చేయని రెండు పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న మాటల్లో వ్యత్యాసం వుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని పవన్ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం చెపితే.. తాను జేఏసీ ద్వారా పరిశీలన చేయిస్తానని, నిధుల విషయాల్లో అందరూ అసత్యాలు పలుకుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎంతో? రాష్ట్రం ఖర్చు చేసిందెంతో చెప్పాలని.. దీనిపై శ్వేతపత్రి విడుదల చేయాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు