మనసుంటే మార్గం ఉంటుంది - వన్ ఎలక్షన్ - వన్ నేషన్‌పై పవన్ కళ్యాణ్

ఠాగూర్

సోమవారం, 26 మే 2025 (15:43 IST)
మనసుంటే మార్గం ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వన్ ఎలక్షన్ - వన్ నేషన్‌పై సోమవారం తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది. ఇందులో ముఖ్య అథితిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 
 
మనసుంటే మార్గం ఉంటుంది. ముందు ప్రారంభిస్తే మార్గం వచ్చే అడ్డంకులు అధిగమించవచ్చు. సమస్యలు లేవని చెప్పను. కానీ, వాటిని అధిగమించగలం. ఎన్నికల ఓటమిపై విపక్షాల ఆరోపణలు అర్థరహితమన్నారు. ఎన్నికల్లో గెలిచినపుడు ఒకలా.. ఓడిపోయినపుడు మరోలా మాట్లాడుతున్నాయని విమర్శించారు. 
 
ఉదాహరణకు గత 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైకాపా గెలిచింది. 2024లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఓడిపోయింది. కానీ, ఎన్నికల్లో గెలిచినపుడు ఈవీఎంల పనితీరును ప్రశంసించిన వైకాపా నేతలు 2024లో ఓటమి పాలుకావడంతో అదే ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 
 
వచ్చే 2026లో జరిగే ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ కూటమి గెలవబోతోందన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నేత అని, ఆయన నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు