వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్... వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వం

సోమవారం, 14 మార్చి 2022 (21:01 IST)
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని చెప్పారు. ముఖ్యంగా, బీజేపీ నేతలు ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఇచ్చంట గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమన్నారు. ఇందుకోసం వైకాపా వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేస్తానని సభా ముఖంగా ప్రకటించారు. 
 
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల కోసమే కాదు వైకాపా పాలనలో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణానికి పూర్తి బాధ్యతలను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గూండా పాలకలకు తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. 

అంతేకాకుండా పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలిపెట్టి ముందుకు వస్తే అపుడు ఎన్నికల పొత్తుల గురించి ఆలోచన చేస్తామని ఆయన ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు