పొత్తు పొడిచింది : వస్తే జనసేన ప్రభుత్వం లేదా మిశ్రమ సర్కారు : పవన్ కళ్యాణ్

గురువారం, 12 జనవరి 2023 (22:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రణస్థలం వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వబోమన్నారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం చెందడం అవసరం లేదన్నారు. మన గౌరవం ఎక్కడా తగ్గకుండా ఉంటే సరిపోతుందన్నారు.
 
అలాగే, ఒంటరిగా అధికారం ఇస్తామని హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. మీరు భరోసా ఇస్తే ఖచ్చితంగా ఒంటరిగా ముందుకు వెళ్లి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అది సాధ్యం కాని పక్షంలో మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వస్తే జనసేన ప్రభుత్వం లేదంటే మిశ్రమ ప్రభుత్వం  ఏర్పాటు తథ్యమన్నారు. అలాగే, తాను త్వరలోనే వారాహి వాహనంపై రాష్ట్ర పర్యటనకు వస్తానని ఎవడ్రా ఆపేది.. దమ్ముంటే ముందుకు రండి అంటూ హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు