సొంత జిల్లాకే న్యాయం చేయలేకపోతే.. రాష్ట్ర ప్రజలకు ఎలా? పవన్ కల్యాణ్

మంగళవారం, 15 మే 2018 (17:58 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లోని ప్రజలకే న్యాయం చేయలేదని... అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చిత్తూరులోని హైరోడ్డు విస్తరణలో భవననాలను కోల్పోయిన బాధితుల పక్షాన అండగా నిలుస్తానని పవన్ తెలిపారు.
 
విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారని, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అంటూ చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని పవన్ సర్కారును నిలదీశారు.
 
అంతకుముందు తిరుమలలో రెండు రోజులు బస చేసిన పవన్ కళ్యాణ్‌ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుడి దర్శించుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్ళి జ్ఞాన ప్రసున్నాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు